ముంబై: మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ మాట్లాడటాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ర్టాలకు చెందిన వారితో తప్ప కార్యాలయాలకు వచ్చే అందరితో మరాఠీనే మాట్లాడాలని స్పష్టం చేసింది.
కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్‌బోర్డులు పెట్టాలని, కంప్యూటర్లకూ మరాఠీ భాష టైప్ చేసేలా కీబోర్డులు ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణారాహిత్యంగా భావించి, చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ మాట్లాడకపోతే ఎవరైనా కార్యాలయ ఇంఛార్జ్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నది.