ముంబై: మరాఠా కోటా కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫ్లైఓవర్‌కు ఉన్న స్తంభానికి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్రలో జరిగిన ఉద్యమంలో సునీల్ కవాలే (45)చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఎంత ఉద్యమించినా బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడంతో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
బుధవారం రాత్రి బాంద్రా ప్రాంతంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పరిశీలించగా మరాఠా రిజర్వేషన్ల కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు ఉన్నది. ఈ నెల 24న ముంబైలో మరాఠా రిజర్వేషన్ల సాధన కోసం అందరూ ఏకమవ్వాలని ఆయన లేఖలో కోరారు. మొదట రిజర్వేషన్లు.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సునీల్ కవాలే లేఖలో ఉద్యమకారులకు సూచించారు.