హిడ్మాలాంటి మావోయిస్టులు ఇక చరిత్రే.. సీఆర్పీఎఫ్ చీఫ్ వార్నింగ్

న్యూఢిల్లీ: మావోయిస్ట్ కమాండర్ మాద్వి హిడ్మాలాంటి వాళ్లు త్వరలోనే చరిత్రలో కలిసిపోతారని హెచ్చరించారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ కుల్దీప్ సింగ్. న్యూస్ 18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ పాల్పడిన హింసపై కుల్దీప్ ఇలా స్పందించారు. తర్వాతి దశ ఆపరేషన్ల కోసం ఇప్పటికే తమ దగ్గర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వాళ్లకు పట్టున్న చాలా ప్రదేశాలను ఆక్రమించేసినట్లు చెప్పారు.
వాళ్లు ప్రస్తుతం ఓ చిన్న ప్రాంతానికే పరిమితమయ్యారు. వాళ్లను ఏరేయడం లేదంటే వాళ్లే పారిపోవడం ఒక్కటే మార్గం అని కుల్దీప్ సింగ్ తేల్చి చెప్పారు. గతంలో 100 చదరపు కిలోమీటర్ల మేర మావోయిస్టులు ఉండేవాళ్లని, ఇప్పుడు అది 20 చదరపు కిలోమీటర్లకు పడిపోయిందని తెలిపారు. ఏడాదిలోపే ఆ చోట్ల కూడా వాళ్లు దాక్కున్న ప్రదేశాలను జల్లెడ పట్టి ఏరేస్తామని స్పష్టం చేశారు. హిడ్మాలాంటి వాళ్లు సంగతేంటని అడగ్గా.. కచ్చితంగా చెప్పలేను కానీ అలాంటి వాళ్లు త్వరలోనే చరిత్రలో కలిసిపోతారు అని అనడం గమనార్హం.
22 మంది భద్రతా సిబ్బందిని ఎన్కౌంటర్లో హతమార్చిన ఘటన వెనుక కీలక సూత్రధారి హిడ్మానే అని అనుమానిస్తున్నారు. సుక్మాకు చెందిన ఈ 40 ఏళ్ల హిడ్మా.. మావోయిస్టుల ప్రధాన దాడులలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఆర్సీబీ జెర్సీలో ఉసేన్ బోల్ట్.. కోహ్లి, డివిలియర్స్ రియాక్షన్ ఇదీ
ఎన్నికల ప్రచారాల్లో మాస్కులు తప్పనిసరి.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
మధ్యప్రదేశ్‌లో 60 గంటల పాటు లాక్డౌన్
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

