లక్నో: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహం వద్ద పామును ఉంచింది. అది కాటు వేయడంతో అతడు మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. (snakebite death turns out as murder) పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్బర్పూర్ సాదత్ గ్రామానికి చెందిన అమిత్ మంచంపై నిద్రిస్తుండగా పాము కాటు వేసిందని అతడి భార్య రవిత మంగళవారం హడావుడి చేసింది.
కాగా, స్థానికులు ఆ ఇంటికి చేరుకున్నారు. మంచంపై ఉన్న అమిత్ పక్కన పాము ఉండటాన్ని చూశారు. అచేతనంగా పడి ఉన్న అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అమిత్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పాము కాటు వల్ల అతడు చనిపోయినట్లు భావించారు. పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
మరోవైపు గొంతు నొక్కడం వల్ల అమిత్ చనిపోయాడని, పాము కాటు వల్ల కాదని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. పాము కాటు వేయడానికి ముందే అతడు మరణించడంతో విషం శరీరంలోకి వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అమిత్ భార్య రవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రియుడు అమర్జీత్తో ఏడాదిగా ఆమెకు సంబంధం ఉందని తెలుసుకున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, తమ సంబంధం గురించి అమిత్‌కు తెలిసి గొడవ చేస్తుండటంతో నిద్రిస్తున్న అతడ్ని గొంతు నొక్కి హత్య చేసినట్లు పోలీసులకు వారు తెలిపారు. పాములు పట్టే వ్యక్తికి వెయ్యి ఇచ్చి పామును కొనుగోలు చేసినట్లు చెప్పారు. అమిత్ మృతదేహం వద్ద పామును ఉంచి దాని కాటు వల్ల మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. దీంతో రవిత, ఆమె ప్రియుడు అమర్జీత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి భర్త సౌరభ్‌ను హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన మీరట్ తరహాలో అమిత్ మర్డర్ కూడా కలకలం రేపింది. దీంతో పోలీసులు మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
#Meerut में सांप को झूठा बदनाम करने वाली पत्नी खुद ही नहीं निकली हत्यारिन,
उसने अपने प्रेमी संग मिलकर पति अमित की गला दबाकर हत्या की उसे हादसे का रूप देने के लिए सपेरे से वाइपर स्नेक खरीदा और उसे पति के लाश के नीचे दबा दिया, सांप ने डेड बॉडी को 10 बार डंसा, पुलिस ने पोस्टमार्टम… pic.twitter.com/0tmQ5yFX0D
— Lokesh Rai (@lokeshRlive) April 17, 2025
#मेरठ में सांप ने नहीं काटा,बीवी ही थी कातिल,पत्नी ने बॉयफ्रेंड संग मिलकर रची थी मर्डर की साजिश,पति की गला दबाकर हत्या, सांप से लाश पर डसवाया, पोस्टमार्टम रिपोर्ट से खुला राज,8 साल की शादी, 3 बच्चे और एक ‘अमर’ इश्क, कत्ल की पूरी स्क्रिप्ट लिखी थी पत्नी रविता ने #meerut pic.twitter.com/GyZcwWdFsq
— AMETHI LIVE (@AmethiliveCom) April 17, 2025