Manipur Violence | మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణే లక్ష్యం : మనోజ్ ఝా
మణిపూర్‌లో ((Manipur Violence) శాంతి నెలకొనేందుకు కుకీ, మైతీ తెగల ప్రజలు సహకరించాలని కోరుతూ శాంతికి మరో ప్రత్యామ్నాయం లేదని మణిపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ((Manipur Violence) శాంతి నెలకొనేందుకు కుకీ, మైతీ తెగల ప్రజలు సహకరించాలని కోరుతూ శాంతికి మరో ప్రత్యామ్నాయం లేదని మణిపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరించాలని తాము కోరుతున్నామని, న్యాయంతో పాటు శాంతి స్ధాపనే తమ డిమాండ్ అని పేర్కన్నారు. రెండు తెగల ప్రజలు సామరస్యంతో నివసించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
మణిపూర్‌లో పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని, మధ్యప్రదేశ్ లేదా మణిపూర్ ప్రాంతం ఏదైనా శాంతికి ప్రత్యామ్నాయం లేదని గుర్తెరగాలని మనోజ్ ఝా స్పష్టం చేశారు. 21 మంది విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించి క్షేత్రస్ధాయి పరిస్ధితులతో కూడిన వివరాలతో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం విపక్ష బృందం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఇక గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో ప్రజలు ఇంకా అభద్రతతో నలిగిపోతున్నారని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కుకీ, మైతీ తెగల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల్లోనూ ఇంకా అభద్రతాభావం నెలకొందని పేర్కొన్నారు.మే 3 నుంచి మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినా రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్ధితి నెలకొనేలా తాను చేయగలినదంతా చేస్తున్నానని తనను కలిసిన విపక్ష ఎంపీ ప్రతినిధి బృందంతో రాష్ట్ర గవర్నర్ అనసూయ పేర్కొన్నారని చెప్పారు.అయితే రాష్ట్ర గవర్నర్‌కు పరిమిత అధికారాలే ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వమే మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు చొరవ చూపాలని తాము కోరుతున్నామని అన్నారు.
Read More :
Raj Kundra | నా భార్య పడుకున్నాక మరదలితో పార్టీ చేసుకునే వాడిని.. శిల్పా శెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

