Raj Kundra | నా భార్య పడుకున్నాక మరదలితో పార్టీ చేసుకునే వాడిని.. శిల్పా శెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు
Shilpa Shetty Husband | రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన సహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా వన్నె తరగని అందంతో నవ హీరోయిన్లకు పోటీనిస్తుంది.
Shilpa Shetty Husband | రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన సహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా వన్నె తరగని అందంతో నవ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. ఆమె పద్నాలుగేండ్ల క్రితం బాగా ధనవంతుడైన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రాజ్ కుంద్రా పేరు ఇండస్ట్రీలో మార్మొగిపోయింది. దాంతో రాజ్ కుంద్రా పేజ్ త్రీ పర్సనాలిటీ అయిపోయాడు. అంతా బాగానే నడుస్తుందనుకున్న టైమ్‌లో పోర్న్ సినిమాలు రూపొందించిన విషయంలో రెండు నెలలు జైల్లోనే గడిపాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తుంటాడు.
ఇక ఇప్పుడు కాస్త ఆ వ్యవహారం చల్లబడింది. మళ్ళీ గతంలో మాదిరిలా జీవితాన్ని గడిపేస్తున్నాడు. కాగా తాజాగా ఓ షోలో రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన్ని హాట్ టాపిక్ చేశాయి. హిందీ టెలివిజన్ రంగంలో టాప్ షోగా పేరున్న కపిల్‌శర్మ కామెడీ షోకు రాజ్‌కుంద్రా తన భార్య శిల్పాశెట్టి, మరదలు షమిత శెట్టి కలిసి వచ్చారు. ఈ షోలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది.
నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లికావాలని నేను కోరుకోను అంటూ చెప్పుకొచ్చాడు. రాజ్ కుంద్రా సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు మాత్రం ద్వంద్వార్థాన్ని ప్రస్తావిస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇక రాజ్ కుంద్రా తనపై పడిన మరకను చెరిపేసుకోవడానికి తన బయోగ్రఫీని సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇందులో మరో విశేషమేంటంటే ఈ సినిమాలో హీరో కూడా అతనే. పోర్న్ వ్యవహరం నుంచి జైల్లో మగ్గిన రెండు నెలలు, ఆపై అతను పడ్డ అవమానాలు ఇలా ప్రతీది సినిమాలో చూపిస్తారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

