ఇంఫాల్, అక్టోబర్ 7: శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన బీజేపీ పాలిత మణిపూర్ సర్కార్ ఆ రాష్ట్రంలో మరోసారి ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగించింది. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో గత ఆరు ఐదు నెలల ఇంటర్నెట్పై నిషేధం అమలవుతున్నది.
ఈ నెల 11 వరకు నిషేధం అమల్లో ఉంటుందని తాజాగా అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలోనే నిషేధాన్ని పొడిగించినట్టు వెల్లడించారు.