Manipur Video | మణిపూర్ అమానవీయ ఘటన కేసులో నిందితుల అరెస్ట్.. హురైన్ ఇంటికి నిప్పు
Manipur Video | మహిళను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనలో ప్రధాన నిందితుడు హురైన్ సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు.
Manipur Video | మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన పెల్లుబుకుతున్న వేళ బీరెన్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ (32)గా గుర్తించిన పోలీసులు గురువారం ఉదయం తోబల్ జిల్లాలో అతడ్ని అరెస్ట్ చేశారు.
గత మే నెల నాలుగో తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై దేశవ్యాప్తంగా అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రోజురోజుకు దేశవ్యాప్తంగా నిరసన పెరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆఘమేఘాలపై ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తామని, చట్ట ప్రకారం వారికి మరణశిక్ష విధించేందుకు కూడా వెనుకాడబోమని సీఎం బీరెన్ సీంగ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రధాన నిందితుడు హురైన్ ఇంటికి స్థానికులు నిప్పు పెట్టారు. కానీ స్థానిక మహిళలు ఈ చర్యలు వ్యతిరేకించారు. నిందితులు చేసింది తప్పేనని, వారిని ఉపేక్షించవద్దని మహిళలు పేర్కొన్నారు. జాతి, కుల, మత బేధాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలే గానీ, వారి ఆస్తుల ధ్వంసం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళ ఒకరు మీడియాతో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

