Starlink Internet | న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసకు పాల్పడుతున్న మిలిటెంట్లు అక్రమంగా ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తెలుస్తున్నది. ‘ది గార్డియన్’ పత్రిక వార్తా కథనం ప్రకారం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్నది. భారత్‌లో స్టార్‌లింక్‌కు అనుమతి లేదు.
అయితే, మయన్మార్‌లో మాత్రం అనుమతి ఉన్నట్టు గార్డియన్ పేర్కొన్నది. మణిపూర్‌కు సరిహద్దునే మయన్మార్ ఉండటంతో మిలిటెంట్లు స్టార్‌లింక్ ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో ఏడాదిన్నరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.