మణిపూర్ ఘటనలో 14కు చేరిన మృతులు
Landslides | మణిపూర్‌లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
ఇంఫాల్: మణిపూర్‌లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. మరో 23 మంది సురక్షితంగా వెలికితీశారు. ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎంతమంది శిథిలాల్లో చిక్కుకుపోయారనే విషయమై ఇంకా స్పష్టత లేదని మణిపూర్ డీజీపీ డౌంగెల్ తెలిపారు. అయితే సుమారు 60 మంది వరకు శిథిలాల కింద ఉండవచ్చని అంచనావేస్తున్నామన్నారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లని చెప్పారు.
#UPDATE Noney, Manipur | 23 people were brought out from debris of which 14 dead. More are being searched. Not confirmed how many are buried but as of now 60 people including villagers, army & railway personnel, labourers (buried): DGP P Doungel (30.06) https://t.co/xTIYrRVP4I pic.twitter.com/4d8jbVZGHy
— ANI (@ANI) June 30, 2022
కాగా, ఇంఫాల్-జిరిబామ్ మధ్య కొత్త రైల్వే లైన్ పనులు జరుగుతున్న తుపుల్ యార్డ్ వద్ధ బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 23 మందిని రక్షించినట్టు సైన్యం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

