ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ భారీ విజయం సాధించారు. హీగాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎన్ బీరెన్ సింగ్ 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పీ శరత్ చంద్ర ఓటమి పాలయ్యారు. 60 స్థానాలున్న మణిపూర్లో 31 స్థానాల్లో బీజేపీ, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇతరులు 22 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.