Miss India Universe 2025 | న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన మణికా విశ్వకర్మ మిస్ ఇండియా యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలచుకుంది. సోమవారం రాత్రి జైపూర్‌లోని జీ స్టూడియోలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 22 ఏళ్ల మణిక కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఈ ఏడాది చివర్లో థాయిలాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా మణికకు కిరీటాన్ని అలంకరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ (22), హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా (19) ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. హర్యానాకే చెందిన అమిషి కౌషిక్ (23), మణిపూర్‌కు చెందిన సరంగథెమ్ నిరుపమ (24) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
మహిళా విద్యకు మద్దతునివ్వడం, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం అన్న అంశాలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలన్న ఫైనల్ రౌండ్ ప్రశ్నకు మణిక మహిళా విద్యను ఎంచుకున్నారు. మహిళకు విద్య నేర్పడం వల్ల అది ఒక జీవితాన్ని మాత్రమే మార్చదని, అది కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తునే మారుస్తుందని సమాధానమిచ్చి న్యాయనిర్ణేతల మనసులు దోచుకున్నారు. విజయానంతరం మణిక మాట్లాడుతూ తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన కుటుంబం, సమాజం, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. తానొక సాధారణ చిన్న పట్టణం నుంచి వచ్చినప్పటికీ కుటుంబం, సమాజం నుంచి చాలా మద్దతు లభించిందని మణిక పేర్కొంది.