న్యూఢిల్లీ : డేటింగ్ యాప్స్ ఇటీవల బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ తరహాలో ప్రతి డేటింగ్ యాప్‌లోనూ (Viral post) వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, హాబీలు, వయసు, ఇతరుల్లో మీరు ఆశిస్తున్న గుణగణాల వంటి వివరాలు పొందుపరిచే బయో ఉంటుంది.
అయితే బయోలో ఓ వ్యక్తి టెన్త్, ఇంటర్, జేఈఈలో తనకు వచ్చిన మార్కులు, ర్యాంకుల వివరాలను నింపేశాడు. ఈ వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇండియన్ చాన్ అనే పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో అంకిత్ ఝా అనే 24 ఏండ్ల యువకుడు తన బయోలో విద్యార్హతల గురించి ప్రస్తావించడం చూడొచ్చు.
బయోలో పొందుపరిచిన వివరాల ప్రకారం అంకిత్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ కాగా, ప్రస్తుతం అతడు ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నాడు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. అతడు లింక్డిన్ ప్రొఫైల్‌గా పొరబడి ఉంటాడని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
Read More