Crime news : ఓ గదిలో ఓ వ్యక్తిని కింద పడేసి నలుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టారు. కింద పడిన వ్యక్తి చుట్టూ చేరి నలుగురు బెల్టుల (Belts) తో, ప్లాస్టిక్ పైపుల (Plastic Pipes) తో చితకబాదారు. బాధితుడు తనను కొట్టవద్దని, విడిచిపెట్టండని వేడుకుంటున్నా ఆ నలుగురు వినిపించుకోలేదు. నాన్‌స్టాప్‌గా కొట్టారు. నలుగురు కొడుతుంటే మరో నిందితుడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడు.
ఆ వీడియోను జతిన్ అనే ఇన్‌స్టా యూజర్ తన ఖాతాలో పోస్టు చేశాడు. దాంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఔరారియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తుల తీరు పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ ఘటనపై తమకు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.