లక్నో: ప్రియురాలిని కలిసేందుకు ఒక యువకుడు బురఖా ధరించాడు. (Man Wears Burqa To Meet Girlfriend) అనుమానించిన స్థానికులు బురఖా తొలగించారు. అతడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు బురఖా ధరించాడు. ప్రియురాలు ఉంటున్న ప్రాంతానికి బురఖాలో వెళ్లాడు.
కాగా, ఒక భవనం నుంచి బయటకు వచ్చిన బురఖాలోని వ్యక్తిని చూసి స్థానికులు అనుమానించారు. దొంగగా, పిల్లలను కిడ్నాప్ చేసే మనిషిగా భావించారు. దీంతో బలవంతంగా బురఖా తీయించారు. బురఖా ధరించిన యువకుడ్ని పట్టుకుని కొట్టారు. అతడి వద్ద పిస్టల్ కూడా ఉందని కొందరు ఆరోపించారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ యువకుడ్ని అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश के जिला मुरादाबाद में गर्लफ्रेंड से मिलने के लिए चांद भूरा नामक युवक बुर्का पहनकर पहुंच गया। लोगों को शक हुआ और उसे पकड़ लिया। तलाशी में एक लाइटर पिस्टल भी मिली। फिर उसकी पिटाई हुई। पुलिस को सौंप दिया गया। pic.twitter.com/lJvA8NVnnq
— Sachin Gupta (@SachinGuptaUP) September 2, 2024