భోపాల్: చనిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సింగ్రౌలి జిల్లా గడాయి గ్రామానికి చెందిన ఒక యువతి ఈ నెల 5న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ ఇంటికి వచ్చిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకునిరావాలని చెప్పారు.
అయితే బాలిక తండ్రి ధీరపతి సింగ్ గోండ్‌కు ఆర్థిక స్థోమత లేక వాహనంలో తరలించలేకపోయాడు. వాహనం సమకూర్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరునాడు మంచంపై కుమార్తె మృతదేహాన్నిఉంచి కొందరు గ్రామస్తులతో కలిసి ఏడు గంటలు మోసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ఒక వ్యక్తి తన మొబైల్లో ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.
కాగా, పోలీస్ అధికారి అరుణ్ సింగ్ దీనిపై స్పందించారు. మృతదేహాలను పోస్టమార్టం కోసం ఆసుపత్రికి తరలించడానికి తమ వద్ద బడ్జెట్ లేదని తెలిపారు. అందుకే వాహనం సమకూర్చలేదని ఆయన వెల్లడించారు.
A man was forced to carry his daughter's body on a cot for post-mortem for 35 km, walking for almost seven hours to reach the hospital in Singrauli @ndtv @ndtvindia pic.twitter.com/cNMYsWVzNh
— Anurag Dwary (@Anurag_Dwary) May 9, 2021