భోపాల్ : టమాట ధరలు ( Tomato Price Hike) చుక్కలు చూపుతూ ప్రతి ఒక్కరి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. నిత్యావసర కూరగాయ ధర కొండెక్కడంతో టమాట లేకుండానే వంటను సరిపెట్టేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని షహ్దోల్ జిల్లాలో భార్యా భర్తల మధ్య ఘర్షణకూ టమాట కారణమైంది. ఈ మధ్య వంట చేస్తూ తాను భార్యకు చెప్పకుండా రెండు టమాటాలు వాడానని టిఫిన్ సర్వీసు అందిస్తున్న సంజీవ్ బర్మన్ చెప్పుకొచ్చాడు.
ఈ చిన్న విషయం భార్యాభర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. తనను అడగకుండా టమాటాలరు వాడటాన్ని తన భార్య జీర్ణించుకోలేకపోయిందని ఆగ్రహంతో కూతురును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందని బర్మన్ వాపోయాడు. వారి కోసం వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాను ఓ కూరలో రెండు టమాటాలు వాడటంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, ఈ విషయానికే కోపంతో ఊగిపోయిన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. తన భార్య ఎక్కడ ఉందో తెలియడం లేదని, మూడు రోజులుగా ఆమెతో మాట్లాడలేదని వాపోయాడు. సంజీవ్‌ను అనునయించిన పోలీసులు త్వరలోనే ఆమెను సంప్రదించి తిరిగి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Read More :