Tomato Price Hike | ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. టమాటాలకు బదులు వంటల్లో వీటిని ట్రై చేయండి
Tomato Price Hike | నిజమే, టమాట ధరలు కొండెక్కాయి. కాదు కాదు, హిమాలయాల మీదెక్కి కూర్చున్నాయి. కొనలేం. తినలేం. అలా అని ఆ పుల్లపుల్లని రుచినీ మరిచిపోలేం. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు నకిలీ శశిరేఖను సృష్టించినట్టు మనం టక్కరి టమాటాను కనిపెట్టాలి.
Tomato Price Hike | నిజమే, టమాట ధరలు కొండెక్కాయి. కాదు కాదు, హిమాలయాల మీదెక్కి కూర్చున్నాయి. కొనలేం. తినలేం. అలా అని ఆ పుల్లపుల్లని రుచినీ మరిచిపోలేం. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు నకిలీ శశిరేఖను సృష్టించినట్టు మనం టక్కరి టమాటాను కనిపెట్టాలి. అది దగ్గర దగ్గరగా టమాట రుచినే ఇవ్వాలి. ఘనత వహించిన మెక్ డొనాల్డ్స్ వారే..
‘క్విట్ టమాట’ నినాదం ఇచ్చారు. మిడిల్‌క్లాస్ జీవులం, జానాబెత్తెడు జీతగాళ్లం మనమెంత? అందులోనూ ఇది ఎన్నికల సీజన్. ఫిరాయింపులు మామూలే. తాత్కాలికంగా టమాటాను బహిష్కరించి, చోటామోటా నేతల్లాంటి దినుసుల్ని కిచెన్ క్యాబినెట్లో చేర్చుకుంటే సరిపోతుంది.

చింతపులుసు : ఏం ఫర్వాలేదు. టమాటాకు బదులుగా చింతపులుసుతో చారు పెట్టుకోవచ్చు. రుచికి తాజా తాజా కొత్తిమీర కుమ్మరిస్తే సరి.

ఉసిరి: ఆరోగ్య సిరి. మిగతా రోజుల్లో ఎటూ నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడైనా ఉసిరి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఉసిరికాయలు దంచి పప్పులో వేసుకుంటే.. టమాటాను మరిపించే పులుపు ఖాయం. ఈమధ్య ఉసిరికాయలు అన్ని సీజన్లలోనూ దొరుకుతున్నాయి.

పెరుగు: కూరల్లో టమాటాకు బదులు కాస్త పుల్లటి పెరుగు జోడిస్తే సరిపోతుంది. బిర్యానీతో పాటు రాజ్మా, చోలే వంటకాలకూ ఈ ఫార్ములా పనిచేస్తుంది.

మామిడికాయ: చారు, పప్పు ఎందులో అయినా వేసుకోవచ్చు. పులుపు గ్యారెంటీ. రుచికి తిరుగులేదు. టమాట అవసరమే లేదు.
.. అయినా, ఇంటిల్లిపాదీ ‘టమాట.. టమాట’ అని కలవరిస్తుంటే పళ్లెం చివర్లో టమాట నిల్వ పచ్చడి వడ్డించండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

