couple’s fight | భార్యాభర్తల మధ్య గొడవ ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. మహిళ భర్తను హత్య
couple's fight | భార్యాభర్తల మధ్య గొడవ (couple's fight) ఆపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో మహిళ భర్తను హత్య చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
చెన్నై: భార్యాభర్తల మధ్య గొడవ (couple’s fight) ఆపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆగ్రహంతో మహిళ భర్తను హత్య చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొల్లాచ్చికి చెందిన 59 ఏళ్ల రాధాకృష్ణన్, 48 ఏళ్ల భార్య సరస్వతి మంగళవారం రాత్రి గొడవపడ్డారు. భూమి అమ్మకానికి సంబంధించి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, రాధాకృష్ణన్‌కు చెందిన భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారాన్ని నడుపుతున్న 36 ఏళ్ల శివకుమార్ జోక్యం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే రాధాకృష్ణన్ కొడవలితో శివకుమార్‌పై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన అతడు రాధాకృష్ణన్ చేతిలోని కొడవలిని లాక్కున్నాడు. దానితో అతడ్ని నరికి హత్య చేశాడు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన రాధాకృష్ణన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Couples fight
- Husband
- Kills
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

