సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కానీ.. అన్ని వీడియోలు వైరల్ కావు. అన్ని వీడియోలు ట్రెండ్ అవవు. అన్ని వీడియోలు నెటిజన్లకు నచ్చవు. కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. అటువంటి వీడియోలలో ఇది ఒకటి. కర్మ అనేది ఎలా ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించడమే కర్మ.
తాజాగా ట్విట్టర్లో షేర్ అయిన ఓ వీడియో పర్ఫెక్ట్ కర్మకు ఉదాహరణగా నిలిచింది. రోడ్డు మీద ఉన్న వీధి కుక్కను చూసి ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్లి తన్నబోయాడు. ఇంతలో కాలు జారి వెల్లికిలా పడిపోయాడు. కుక్కను తన్నబోయి.. స్లిప్ అయి కాలు జారి కింద పడిపోయి వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంచిగయింది.. కుక్క నిన్ను ఏమన్నదని దాన్ని తన్నబోయావు. నీకు తగిన శాస్తి జరిగింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Perfect karma! 😂😂pic.twitter.com/rsL2u3SHz7
— Natureholic (@Natureholic2) February 19, 2022