Ukraine: మీటింగ్‌లో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిలర్.. ఉక్రెయిన్‌లో 26 మందికి గాయాలు.. వీడియో
Ukraine: గ్రామ మీటింగ్‌లో ఓ కౌన్సిలర్ గ్రేనేడ్లతో దాడి చేశాడు. ఈ ఘటన ఉక్రెయిన్‌లో జరిగింది. ఆ దాడిలో ఒకరు మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)లోని ఓ గ్రామంలో మండలి మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ కౌన్సిలర్ గ్రేనేడ్ దాడి చేశాడు. దీంతో ఆ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. నల్ల దుస్తుల్లో వచ్చిన అతను.. తన జేబులో ఉన్న గ్రేనేడ్లను తీసి ఫ్లోర్ మీద విసిరేశారు. గ్రేనేడ్లు పేలడంతో 26 మంది గాయపడ్డారు.
పశ్చిమ ఉక్రెయిన్‌లోని కిరెస్కీ గ్రామంలో జరిగిన మీటింగ్‌లో ఈ ఘటన జరిగింది. గ్రేనేడ్ దాడికి చెందిన వీడియో కూడా రిలీజ్ అయ్యింది. చాలా కూల్‌గా రూమ్‌లోకి వచ్చిన ఆ కౌన్సిలర్ తన జేబుల్లో ఉన్న గ్రేనేడ్‌ను తీసి ఫ్లోర్‌పై విసిరేశాడు.
🚨#BREAKING: #UKRAINE DEPUTY DETONATES GRENADE IN COUNCIL MEETING | 1 DEAD, 26 injured#Russia#RussiaIsCollapsing #RussiaUkraineWar#ATTACK #Ukraine pic.twitter.com/9KktaaMCxd
— Feroze saifi (@31khan_honey) December 15, 2023
గ్రేనేడ్లను నేలపై విసిరేసిన వెంటనే అవి పేలాయి. ఆ రూమ్‌లోని కెమెరాలకు భారీ శబ్ధాలు, ఫ్లాష్‌లు చిక్కాయి. ఈ ఘటనపై ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ఎస్‌బీయూ .. ఉగ్రవాద కోణంలో విచారణ చేపట్టింది. అక్రమ ఆయుధాల కోణంలో ఆ దేశ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

