ముంబై: రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను కడుపులో దాచుకొని అక్రమంగా రవాణా చేయాలని చూసిన బెనిన్ జాతీయుడి ఎత్తుగడను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చిత్తు చేశారు. గత నెల 21న ముంబై విమానాశ్రయంలో నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.
అతడి పొట్టలో ఉన్న 43 హెరాయిన్ క్యాప్సుల్స్ బయటకు తీయించారు. 504 గ్రాముల హెరాయిన్ తరలిస్తున్నట్టు అతడు అంగీకరించాడు.