న్యూయార్క్ : థర్మన్ గస్టిన్కు గత వారం మరచిపోలేని అనుభవం ఎదురైంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సమీపంలోని కామెరాన్ పారిష్‌లో రెండు పింక్ డాల్ఫిన్లు ఇటీవల అతడి కంటపడ్డాయి. జులై 12న ఓల్డ్ రివర్ పాస్‌లో చేపలు పడుతుండగా కనిపించిన రెండు పింక్ డాల్పిన్ల అరుదైన వీడియోను (Viral Video )గస్టిన్ ఫేస్బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మేం లూసియానాలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు దిగువన ఉన్న కాలువలో చేపలు పడుతుండగా, నీటి కింద భారీగా ఉన్న డాల్పిన్ను చూశాను..అప్పుడది ఏ రంగులో ఉన్నదీ స్పష్టంగా తెలియకపోయినా వెంటనే నేను కెమెరాను బయటకు తీసి రికార్డు చేయడం ప్రారంభించా..ఆపై కొద్దిసేపటికి అది పడవకు దగ్గరగా వచ్చింది. రెండు డాల్ఫిన్లు ఒకటి పెద్దది కాగా మరొకటి చిన్నది బోట్ దగ్గరగా వచ్చాయని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఈరోజు రెండు పింక్ డాల్ఫిన్లను చూశా..! అత్యద్భుతం! అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. తాను 20 ఏండ్లుగా చేపలు పడుతున్నా ఈ సారి చాలా అదృష్టం కలిగిందని అన్నారు. ఇవి ఎంతో అరుదుగా కనిపిస్తుంటాయి. చాలామందికి తమ జీవిత కాలంలో ఎన్నడూ పింక్ డాల్ఫిన్లు తారసపడవని చెప్పుకొచ్చారు. అల్బినో డాల్పిన్స్ జెనెటిక్ మ్యుటేషన్‌కు గురవడంతో వాటి చర్మం పింక్, వైట్‌గా కనిపిస్తుందని సైంటిస్ట్ గ్రెగ్ బార్ష్ నేషనల్ జియోగ్రాఫిక్తో తెలిపారు.
Read More :