సోమవారం 13 జూలై 2020
National - Apr 23, 2020 , 11:46:02

తండ్రి శవం వద్దే 3 రోజుల పాటు కుమారుడు

తండ్రి శవం వద్దే 3 రోజుల పాటు కుమారుడు

అహ్మదాబాద్‌ : తండ్రికేమో అనారోగ్యం.. కుమారుడేమో మానసిక వికలాంగుడు. తల్లేమో లాక్‌డౌన్‌ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయింది. సోదరి ఫోనేమో కలవలేదు. మొత్తానికి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కన్నుమూశాడు. తండ్రి శవం వద్దే మూడు రోజుల పాటు కుమారుడు ఉండిపోయాడు. ఈ విషాదకర సంఘటన అహ్మదాబాద్‌లోని గురుకుల్‌ ఏరియాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

వస్ర్తాపూర్‌ పోలీసుల కథనం మేరకు.. 75 ఏళ్ల వృద్ధుడు తన భార్య, కుమారుడితో కలిసి నీల్‌మని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. అయితే వృద్ధుడు గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడు మానసిక వికలాంగుడు. అయితే భార్య వేరే పని నిమిత్తం ఇటీవలే ముంబయి వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆమె అక్కడే చిక్కుకుపోయింది. 

అయితే వృద్ధుడు చనిపోయే కంటే ముందు.. తన బిడ్డకు ఫోన్‌ చేసినా కలవలేదు. మొత్తానికి ఆ వృద్ధుడు మృతి చెందాడు. తండ్రి శవం వద్దే కుమారుడు 3 రోజుల పాటు ఉన్నాడు. వృద్ధుడు నివాసంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడు నివాసముంటున్న ఇంటిని తలుపులు తెరవగా అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మృతదేహానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. logo