man sets family ablaze | నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు నిప్పు పెట్టిన వ్యక్తి.. ఆపై ఆత్మహత్యకు యత్నం
man sets family ablaze | నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. (man sets family ablaze) ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు.
తిరువనంతపురం: నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. (man sets family ablaze) ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు. ఆ వ్యక్తితోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొట్టెక్కటిల్ జాన్సన్ అనే వ్యక్తి మన్నుతి సమీపంలోని ప్రాంతంలో నివసిస్తున్నాడు. కుటుంబ గొడవల కారణంగా గురువారం తెల్లవారుజామున దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకు జోజి, కోడలు లిజి, మనవడు టెండూల్కర్‌కు నిప్పంటించాడు. అనంతరం టెర్రస్‌పైకి వెళ్లి విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కాగా, మంటలను గమనించిన పొరుగువారు వాటిని ఆర్పివేశారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తీవ్రంగా కాలిన గాయాలైన ముగ్గురు కుటుంబ సభ్యులను, టెర్రస్‌పై అపస్మారక స్థితిలో ఉన్న జాన్సన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి కుమారుడు, మనవడు చికిత్స పొందుతూ మరణించారు. జాన్సన్, అతడి కోడలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ablaze
- family
- Kerala's Thrissur
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

