నాకు ఏ పనీ దొరకడం లేదు అంటూ కొందరు ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటారు. కనీసం రోజుకు రూపాయి కూడా సంపాదించని వాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లు పని చేయడం పక్కన పెట్టి సాకులు వెతుకుతుంటారు. కానీ.. కొందరు మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదాన్ని నమ్ముతారు. అందుకే.. న్యాయంగా.. నిజాయితీగా ఏదైనా పని చేసుకొని బతుకుతారు. అటువంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇతడు.. హర్యానాలోని ఫరిదాబాద్‌లో సైకిల్ మీద మోమోస్ అమ్ముతున్నాడు. నిజానికి.. ఈరోజుల్లో సైకిల్ మీద స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్లు చాలా తక్కువ. బేల్, పానీపూరీ, దోశ లాంటివి అమ్మడం చూశాం కానీ.. సైకిల్ మీద మోమోస్ అమ్మేవాళ్లను ఎప్పుడూ చూడలేదు కదా.
ఫరిదాబాద్‌లో సైకిల్ మీద మోమోస్ అమ్ముతున్న ఈ వ్యక్తి.. ఫుడ్ బ్లాగర్ విశాల్ కంటపడ్డాడు. దీంతో సైకిల్ మీద మోమోస్ ఎలా సెట్ చేశాడు. మోమోస్‌ను వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ ఎలా అమ్ముతాడు.. రోజుకు ఎంత గిట్టుబాటు అవుతుంది.. అనే విషయాలను విశాల్ అడిగి తెలుసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేశాడు.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్.. సూపర్.. సైకిల్ మీద మోమోస్ అమ్ముతూ ఎంతో కష్టపడుతున్నావు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.