న్యూఢిల్లీ : ఊహించని పరిస్ధితుల్లో చిక్కిన జంతువులను ప్రాణాపాయం నుంచి కాపాడే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఇక కొన్నిసార్లు కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి జంతువులకు ఆపన్న హస్తం అందిస్తుంటారు. అలాంటి రెస్క్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. ఈ వైరల్ క్లిప్‌లో ఓ వ్యక్తి సముద్ర తీరం వెంబడి బండరాళ్లలో చిక్కుకున్న తాబేలును ఎంతో రిస్క్ చేసి మరీ కాపాడతాడు. రాళ్ల మధ్యలో చిక్కిన తాబేలును కాపాడిన వ్యక్తి మెల్లగా దాన్ని సముద్రంలోకి విడిచిపెట్టడం ఈ వీడియోలో కనిపించింది.
టర్టల్ రెస్క్యూ ! రాళ్లలో చిక్కుకున్న తాబేలును కాపాడి జంతువుకు స్వేచ్ఛనిచ్చిన హీరో అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.8 లక్షల మంది వీక్షించారు. నిస్వార్ధంగా వ్యవహరించి జంతువును కాపాడిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :