న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన సోదరుడు, బంధువుతో కలిసి అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించాడు. వారితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. స్కూటర్‌పై వచ్చిన ముగ్గురు సాయుధులు వారిని అడ్డుకుని దోచుకున్నారు. (Men Robbed By Armed Men) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 27న గౌరవ్ శుక్లా తన తమ్ముడు సౌరభ్ శుక్లా, బంధువైన నీరజ్ శుక్లాతో కలిసి ఇటీవల సర్జరీ జరిగిన తల్లిని కలిశాడు. 3 గంటల సమయంలో వారితో కలిసి గౌతమ్ విహార్‌లోని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
కాగా, స్కూటర్‌పై వచ్చిన ముగ్గురు యువకులు గౌరవ్ శుక్లా, అతడి సోదరుడు, బంధువును అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులు తుపాకులతో బెదిరించి వారి వద్ద ఉన్న వస్తువులన్నీ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గురి బ్యాగులతోపాటు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, గుర్తింపు కార్డులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఇంటికి చేరుకున్న తర్వాత గౌరవ్ శుక్లా పోలీసులకు ఫోన్ చేశాడు. సాయుధులు దోచుకోవడంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. అయితే దొంగల వద్ద గన్స్ ఉన్నట్లు చెప్పవద్దని గౌరవ్ శుక్లాతో పోలీస్ అధికారి అన్నాడు. లేని పక్షంలో నిందితులను గుర్తించేందుకు పోలీస్ స్టేషన్‌కు పలుమార్లు రావాల్సి వస్తుందని హెచ్చరించాడు.
కాగా, సాయుధులు తుపాకులతో బెదిరించి తమను దోచుకోవడం గురించి గౌరవ్ శుక్లా సోషల్ మీడియాలో వాపోయాడు. దొంగల వద్ద గన్స్ ఉన్నట్లు చెప్ప వద్దన్న పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సాయుధ దొంగలను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
#Delhi #WATCH
यह @DCPNEastDelhi के अंदर आने वाले उस्मानपुर थाने की शानदार पुलिस का हाल है।26-27 अगस्त की रात हुई लूट को स्नैचिंग बनाया। अब तक आईओ घटनास्थल पर नहीं पहुंचा।पीड़ित ने खुद सीसीटीवी फुटेज निकाली। बदमाशों के हौसले बुलंद@SandhyaTimes4u @NBTDilli @CPDelhi #DelhiPolice https://t.co/I1YtInBXdB pic.twitter.com/11rUF4ybVF— Kunal Kashyap (@kunalkashyap_st) August 30, 2024