న్యూఢిల్లీ : ప్రపంచంలో దయార్ధ్ర హృదయుల సంఖ్య తరిగిపోలేదనేందుకు ఉదంతంగా ఓ ఘటన వెలుగుచూసింది. బిజీ రోడ్డుపై గాయంతో అపస్మారక స్ధితిలో పడిన కుక్కను ఓ వ్యక్తి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి స్వార్ధం లేని అతడి చొరవను నెటిజన్లు ప్రశంసించారు. ఈ వీడియోను కర్తవ్య సొసైటీ అనే పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ క్లిప్‌లో రోడ్డుపై కదలిక లేకుండా పడిఉన్న కుక్కను చూసి ఓ వ్యక్తి, మహిళ ఆగడం కనిపిస్తుంది. కుక్క చనిపోయిందని తొలుత వారు భావించినా ఆపై దగ్గరవెళ్లి చూస్తే కుక్క సజీవంగానే ఉందని ఆ వ్యక్తి గమనిస్తాడు. వెంటనే కుక్కను తన చేతుల్లోకి తీసుకుని వెటర్నరీ క్లినిక్‌కు తీసుకువెళతాడు.
కుక్క తలకు గాయం కావడంతో రక్తస్రావమై అది అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. చికిత్స అనంతరం కుక్క కోలుకుంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి కోటికి పైగా వ్యూస్ లభించాయి. మూగ జీవాల పట్ల అతడు చూపిన నిస్వార్ధ ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తుల అవసరం చాలా ఉందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.