లక్నో: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక వ్యక్తి, లేడీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Doctor) అడ్డుకోబోయిన ఆమె కుమార్తెపై దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. టీలా మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో 32 ఏళ్ల వైద్యురాలు క్లినిక్ నిర్వహిస్తున్నది. రెండేళ్ల కిందట 42 ఏళ్ల మింటూ అలియాస్ సునీల్ ఆ క్లినిక్‌కు వచ్చాడు. నాటి నుంచి అతడు, లేడీ డాక్టర్ స్నేహితులయ్యారు.
కాగా, ఒక కూతురు ఉన్న ఆ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని సునీల్ నమ్మించాడు. ఆ సాకుతో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. శనివారం రాత్రి ఆమె ఫ్లాట్‌కు వెళ్లాడు. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన లేడీ డాక్టర్ కుమార్తెను కొట్టాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సునీల్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.