Man Rapes, Tortures Woman | మహిళపై వేడివేడి పప్పు పోసి.. దారుణంగా హింసించి లైంగిక దాడి
Man Rapes, Tortures Woman | ఒక వ్యక్తి మహిళను దారుణంగా హింసించాడు. వేడివేడి పప్పు ఆమెపై పోయడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళను దారుణంగా హింసించాడు. వేడివేడి పప్పు ఆమెపై పోయడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ( Man Rapes, Tortures Woman) బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న ఒక వ్యక్తి తన భార్యను కొడుతున్నట్లు నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కాపాడారు. ఆమె శరీరంపై 20కు పైగా కాలిన గాయాలు ఉండటంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, పోలీసులు ఆ మహిళను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తాము భార్యాభర్తలు కాదని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన తనకు ఢిల్లీలో ఉంటున్న 28 ఏళ్ల పరాస్తో మూడు నెలల కిందట ఫోన్లో పరిచయం ఏర్పడినట్లు చెప్పింది. జనవరి మొదటి వారంలో బెంగళూరులోని ఇంట్లో పని కుదరడంతో అక్కడకు వెళ్లేందుకు ఢిల్లీ చేరుకున్నట్లు వెల్లడించింది. పరాస్‌ను కలువడంతో ఢిల్లీలో పని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, దీంతో అతడు నివసిస్తున్న అద్దె ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్లు ఆ మహిళ తెలిపింది.
మరోవైపు కొన్ని రోజులుగా పరాస్ ఆ మహిళను కొట్టి హింసించసాగాడు. ఉడుకుతున్న వేడి వేడి పప్పును ఆమె శరీరంపై పోసేవాడు. అతడు వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరాస్‌ను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నిందితుడు ఢిల్లీలోని ఒక ఈటరీలో కుక్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

