లక్నో: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. దీంతో సోదరుడు, బంధువైన మహిళతో కలిసి భార్యను హత్య చేశాడు. (Man Kills Wife) ఇంటి సమీపంలోని చెత్త కుప్ప దగ్గర ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. మహిళ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడాది తర్వాత అవశేషాలను గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల ఆసిఫా, కమీల్ భార్యాభర్తలు. అయితే భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ 23న సోదరుడు ఆదిల్, అత్త చాందిని సహాయంతో ఆసిఫా గొంతు నొక్కి హత్య చేశాడు. ఇంటి సమీపంలోని చెత్త కుప్ప సమీపంలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు.
కాగా, ఆసిఫా కనిపించడం లేదని, భర్త కమీల్ రెండేళ్లుగా తమతో మాట్లాడనీయడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి 26న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆసిఫా భర్త కమీల్, అతడి సోదరుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు ఆసిఫాను హత్య చేసినట్లు వారిద్దరూ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కమీల్, అతడి సోదరుడు ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితురాలు చాందిని కోసం వెతుకుతున్నారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.