Man Kills Live-In Partner | సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి.. సహకరించిన సోదరి
Man Kills Live-In Partner | జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్‌తో కలిసి ఢిల్లీలోని రూమ్‌లో ఉండేదని అన్నారు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వినీత్ ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య (Man Kills Live-In Partner) చేశాడు. నిందితుడు పరారీలో ఉండగా, సహకరించిన అతడి సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న కరవాల్ నగర్‌లోని కృష్ణ పబ్లిక్ స్కూల్ సమీపంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతురాలిని ఉత్తరాఖండ్‌లోని మిరాజ్పూర్కు చెందిన 25 ఏళ్ల రోహినా నాజ్ అలియాస్ మహిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నాజ్ మృతదేహాన్ని పడేయడంలో నిందితుడికి సహకరించిన సోదరి పారుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ప్రశ్నించగా నాజ్‌ను తన సోదరుడు వినీత్ హత్య చేసినట్లు వెల్లడించింది.
కాగా, నిందితుడు వినీత్‌కు నేర చరిత్ర ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2017లో బాగ్‌పట్‌లోని రామలా షుగర్ మిల్లులో వినీత్, అతడి తండ్రి హత్యకు పాల్పడినట్లు చెప్పారు. 2019 అక్టోబర్ 25న తండ్రీకొడుకులు దోషులుగా తేలడంతో కోర్టు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడించారు. దీంతో జైల్లో ఉన్న వినీత్ గత ఏడాది నవంబర్ 26న బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్‌తో కలిసి ఢిల్లీలోని రూమ్‌లో ఉండేదని అన్నారు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వినీత్ ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, తనను పెళ్లి చేసుకోవాలని వినీత్‌ను నాజ్ ఒత్తిడి చేసింది. అయితే ఆమె వేరే మతానికి చెందడంతో పెళ్లికి వినీత్ కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో నాజ్‌ను అమ్మేయాలని వినీత్, అతడి సోదరి పారుల్ తొలుత ప్లాన్ వేశారు. అయితే ఈ విషయం నాజ్‌కు తెలియడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12న పెళ్లి విషయంపై నాజ్, వినీత్ మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్భంగా నాజ్ గొంతు నొక్కి వినీత్ హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడ్ని పిలువగా బైక్‌పై వచ్చాడు. సోదరి పారుల్ సహాయంతో నాజ్ మృతదేహాన్ని కృష్ణ పబ్లిక్ స్కూల్ సమీపంలో పడేశారు. నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు వినీత్, అతడి స్నేహితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

