రాంచీ: తండ్రైన వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (Man Kills Children, Dies By Suicide) ఈ సమాచారం తెలిసి పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుసుకున్నారు. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహేశ్‌లిటి గ్రామంలోని ఒక ఇంటి తలుపులు ఆదివారం ఉదయం తెరుచుకోలేదు. దీంతో అనుమానించిన స్థానికులు లోపలకు వెళ్లి చూశారు. ఒక వ్యక్తి మృతదేహం సీలింగ్‌కు వేలాడుతుండగా, అతడి పిల్లల మృతదేహాలు ఆ సమీపంలో కింద ఉండటాన్ని గమనించి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. మృతులను 36 ఏళ్ల సనాల్ అన్సారీ, ఇద్దరు కుమార్తెలైన 12 ఏళ్ల అఫ్రీన్ పర్వీన్, 8 ఏళ్ల జైబా నాజ్, ఆరేళ్ల కుమారుడు సఫాల్ అన్సారీగా గుర్తించారు. ముగ్గురు పిల్లల గొంతునొక్కి హత్య చేసిన తర్వాత సనాల్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పుట్టింటికి వెళ్లిన మృతుడి భార్యకు ఈ విషయం తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.