లక్నో: తన భార్యతో తండ్రికి వివాహేతర సంబంధం ఉండటంపై కొడుకు రగిలిపోయాడు. కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. (man kills father) మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బసౌద్ గ్రామానికి చెందిన ఈశ్వర్, కూలీ పనులు చేసేవాడు. మార్చి 21న సాయంత్రం వేళ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతడి మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు తన తండ్రిని హత్య చేసినట్లు మృతుడి కుమారుడు వేద్పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈశ్వర్ కుమారుడు వేద్పాల్పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తండ్రిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్యతో తండ్రికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. అందుకే కూలీ డబ్బులు ఆమెకు ఇస్తున్నాడని తెలిపాడు.
మరోవైపు బ్యాంకు రుణం వాయిదాలు చెల్లించేందుకు తండ్రి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదని వేద్పాల్ ఆరోపించాడు. ఈ విషయంపై ఘర్షణ వల్ల తండ్రిని చంపినట్లు అతడు ఒప్పున్నాడని పోలీస్ అధికారి వివరించారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.