ముంబై, సెప్టెంబర్ 26: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రాలయ భవనం (సచివాలయం) పైనుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని నినాదాలు చేస్తూ అతడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయితే రక్షణగా ఏర్పాటు చేసిన వలలోనే అతడు పడటంతో సురక్షితంగా బయటపడ్డాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాగా నెల రోజుల వ్యవధిలో మంత్రాలయ భవనంలో ఇలాంటి ఘటన చోటుచోసుకోవడం ఇది రెండోసారి. గత నెల 29న మహారాష్ట్రకు చెందిన కొందరు నిర్వాసిత రైతులు కూడా ఈ భవనం పై నుంచి నెట్పైకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.