వీడియోకాల్లో ప్రియురాలితో గొడవ.. మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..!
Man Jumps into River: ఆవేశం అనర్థానికే అనే విషయాన్ని మరో ఘటన రుజువు చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

జల్పాయ్గురి: ఆవేశం అనర్థానికే అనే విషయాన్ని మరో ఘటన రుజువు చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ యువకుడు గత అర్ధరాత్రి తన ప్రియురాలికి వీడియోకాల్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువకుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే.. కోపంతో బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అనంతరం జల ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్గురి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జల్పాయ్గురి జిల్లా కేంద్రానికి చెందిన ధీరజ్ ప్రజాపతి స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో వీడియో కాల్ మట్లాడుతూ తీస్తానదిపై ఉన్న బ్రిడ్జి మీదకు వెళ్లాడు. మాటల్లోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో క్షణికావేశానికి లోనైన ధీరజ్ ప్రజాపతి.. ఫోన్ మాట్లాడుతూనే నదిలోకి దూకేశాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన ధీరజ్ కోసం సెర్చింగ్ చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

