లక్నో : సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ అవడానికి, ఇన్‌స్టా గ్రాం రీల్స్ కోసం ఏం చేసేందుకైనా కొందరు వెనుకాడటం లేదు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో 22 ఏండ్ల యువకుడు రైల్వే క్రాసింగ్ వద్ద టెడ్డీ అవుట్‌ఫిట్‌తో డ్యాన్సులు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టెడ్డీ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని సూరజ్ కుమార్‌గా గుర్తించారు. రైల్వే ట్రాకుల పక్కనే తన రీల్ కోసం డ్యాన్స్ చేశాడు. ఎక్కువ లైక్‌లు, వ్యూస్ కోసం అతడు టెడ్డీ దుస్తుల్లో రైలు పట్టాల పక్కన డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. అతడు అనుకున్నట్టు వ్యూస్ దక్కినా సూరజ్ విన్యాసాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కంటపడటంతో ఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.