తుంగతుర్తి, అక్టోబర్ 06 : దిన దినం ప్రజల బ్రతుకు భారంగా మారి నిత్యావసర వస్తువులు బియ్యం, నూనెలు, కూరగాయలు మొదలగు వస్తువుల ధరలు ఆకాషాన్ని అంటుతుండడంతో ప్రజలకు ఆర్ధిక భారం పెరిగిపోతుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు పెరుగుతున్న నిత్యవసారాల ధరలను అరికట్టడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలు రోజు మొత్తం పని చేస్తే రూ.300 వస్తుందని వాటితో వారి ఇల్లు గడవడం లేదని వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసరదారులను ప్రభుత్వాలే అరికట్టాలని డిమాండ్ చేశారు.