రాంపూర్: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. 11 ఏండ్ల పేద బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చి, పొలంలో నగ్నంగా పడేసి వెళ్లిపోయాడు. ఒంటిపై తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో ఓ పొలంలో పడివున్న ఆమెను బుధవారం కొంతమంది గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని డాన్సింగ్ (24)గా గుర్తించిన రాంపూర్ పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చింది. షాక్కు గురైన బాధితురాల్ని మీరట్ మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెప్పారు.