Man Gets 141 Year Prison Sentence | సవతి కూతురుపై అత్యాచారం.. ఒక వ్యక్తికి 141 ఏళ్లు జైలు శిక్ష
Man Gets 141 Year Prison Sentence | ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
తిరువనంతపురం: ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (Man Gets 141 Year Prison Sentence) కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన కుటుంబం పని కోసం కేరళకు వలస వచ్చింది. అయితే 2017 నుంచి 2020 వరకు సవతి తండ్రి సవతి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ బాలికపై అత్యాచారం చేసేవాడు.
కాగా, బాధిత బాలిక ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె సూచనతో సవతి తండ్రి అకృత్యాలను తల్లికి వివరించింది. దీంతో 2021లో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సవతి తండ్రిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు, ఐపీఎస్, జువెనైల్ జస్టిస్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో బెయిల్పై విడుదలైన ఆ వ్యక్తి సవతి కుమార్తెపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై మరో కేసు నమోదైంది.
మరోవైపు మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ రెండు కేసులపై విచారణ జరిపింది. నవంబర్ 29న జడ్జి అష్రఫ్ ఏఎం తీర్పు ఇచ్చారు. సవతి కుమార్తెపై ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం రెండు కేసుల్లో మొత్తం 141 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.
కాగా, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు పేర్కొంది. దీంతో ఆ వ్యక్తి గరిష్ఠంగా 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే దోషికి రూ.7.85 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. బాధితురాలికి ఈ నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

