ముంబై : ముంబై మేయర్ ముందే ఓ వ్యక్తి మ్యాన్‌హోల్ లో పడిపోయాడు. ముంబై నగరంలో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురవడంతో.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు మేయర్ రితూ తావ్డే పర్యటించారు. సిబ్బందితో పరిస్థితిపై ఆరా తీస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి మ్యాన్‌హోల్ లో పడిపోయాడు. సిబ్బంది అతన్ని పైకి తీశారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటనపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ తెరిచి ఉంటే ఆ వార్డు ఇన్ఛార్జ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి మ్యాన్‌హోల్ చుట్టూ అలర్ట్ సింబల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తావ్డే వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తాము ఏర్పాటు చేస్తున్న సింబల్స్‌ను గమనించాలని కోరారు. ఇక మ్యాన్‌హోల్‌లో పడిపోయింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య కార్మికుడు అని గుర్తించారు. ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ముంబైని తాకాయి.