పాట్నా: కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్‌ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే రైలు దాటిన తర్వాత ప్లాట్‌ఫారమ్ గోడ, రైలు పట్టాల మధ్య ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. (Train Passes Over) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. సమస్తిపూర్ రైల్వేస్టేషన్ నుంచి కదులుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే తోపులాటకు పట్టుతప్పిన అతడు జారి ట్రాక్‌పై పడిపోయాడు.
కాగా, రైలు కదులుతుండటంతో ఇది చూసిన మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. వారి అరుపులు, కేకలతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైలు పట్టాల వద్ద పడిన ఆ వ్యక్తిని దాటి స్టేషన్ చివర వరకు వెళ్లిన ఆ రైలు ఆగింది.
మరోవైపు ప్లాట్‌ఫారమ్ గోడ, రైలు పట్టాల మధ్య ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కొందరు ప్రయాణికులు అతడ్ని ప్లాట్‌ఫారమ్‌పైకి చేర్చారు. అనంతరం ఆ వ్యక్తి ఆ రైలు ఎక్కడంతో అది ముందుకు కదిలింది. ఒకరు రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
समस्तीपुर रेलवे स्टेशन पर युवक के ऊपर से गुजर गई ट्रेन, फिर भी एक खरोंच तक नहीं आई, बाल-बाल बची जान#samastipur #news pic.twitter.com/OLJIS5w57g
— Samastipur Town (@samastipurtown) December 21, 2024