ఇటీవల ఫుడ్ చాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. రెస్టారెంట్లు తమ ప్రమోషన్లో భాగంగా ఈ చాలెంజ్ విసురుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ.. గెలుపొందినవారికి భారీ బహుమతులు అందజేస్తున్నారు. కాగా, ఢిల్లీకి చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ ఫుడ్ చాలెంజ్ గెలిచి, బుల్లెట్ బైకును సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రోడ్డుపక్కన ఫుడ్ బ్లాగర్ రజినీశ్ జ్ఞాని 21 ప్లేట్ల చోలేకుల్చేలను తినడం ప్రారంభించాడు. సమయం గడుస్తున్నకొద్దీ వెనుకబడ్డాడు. మధ్యలో అటూ ఇటూ ఎగురుతూ తిన్నది అరిగించుకునే ప్రయత్నం చేశాడు. 6-7 గ్లాసుల లస్సీ తాగాడు. చివరకు రెస్టారెంట్ నిబంధనల ప్రకారం 30 నిమిషాల్లో 21 ప్లేట్ల చోలేకుల్చేలు తిని, చాలెంజ్ గెలిచాడు. బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, చివరగా ఇదంతా ప్రమోషన్లో భాగంగానే చేశానని చెప్పి ఆ బుల్లెట్ బైక్‌ను యజమానికి తిరిగి ఇచ్చాడు. బుల్లెట్ బైక్ గెలువాలనుకునేవారు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతంలోగల బన్సల్ స్వీట్స్ ఎదురుగా ఉన్న ఆచార్య నికేతన్ మార్కెట్లోగల హరి ఓం కే స్పెషల్ చోలే కుల్చేకు విచ్చేయాలని అతడు ఆహ్వానించాడు. కాగా, ఈ వీడియో ఫేస్బుక్లో 12 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకున్నది.