Man Rapes neighbour Woman | పొరుగింటి మహిళకు మత్తుమందు ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్
Man Rapes neighbour Woman | తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్‌ను డ్రైవర్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: తరచుగా ఆటోలో ప్రయాణించే పొరుగింటి మహిళకు మత్తుమందు కలిపిన జ్యూస్‌ను డ్రైవర్ ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Rapes neighbour Woman) కేరళంలోని పతనంతిట్ట జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అడూర్‌లో నివసించే వినోద్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. పొరుగున నివసించే 28 ఏళ్ల మహిళ తరచుగా అతడి ఆటోలో ప్రయాణించేది.
కాగా, భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళపై వినోద్ కన్నుపడింది. ఫిబ్రవరిలో మత్తుమందు కలిపిన జ్యూస్ ఆమెతో తాగించాడు. ఆ తర్వాత ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని వీడియో రికార్డ్ చేశాడు. ఆమెను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడు.
మరోవైపు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆ మహిళను వినోద్ బెదిరించసాగాడు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తన భర్తకు ఆమె చెప్పింది. ఇది తెలుసుకున్న వినోద్ ఆగ్రహంతో ఆ మహిళను కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అయితే తనపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న వినోద్ పారిపోయాడు. చివరకు నిందితుడ్ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని ప్రశ్నించి డిజిటల్ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- auto-rickshaw
- drugs
- Films
- hired
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

