Atal Setu Bridge | అటల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. వీడియో
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge)పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge)పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. డోంబివ్లి (Dombivli)కి చెందిన 38 ఏళ్ల శ్రీనివాస్ కురుటూరి (Srinivasan Kuruturi) తన కారులో నవీ ముంబై వెపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బ్రిడ్జ్‌పై ఓ చోట తన నెక్సాన్ కారును ఆపి ఒక్కసారిగా బ్రిడ్జ్ రెయిలింగ్‌పైకెక్కి సముద్రంలోకి దూకేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
బుధవారం మధ్యాహ్నం 12:24 గంటల సమయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్థానికుల సహకారంతో శ్రీనివాస్ కోసం తీవ్రంగా గాలించారు. అయితే మధ్యాహ్నానికి వర్షం, అలలు ఎగసిపడుతుండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిది నెలల క్రితమే స్వదేశానికి వచ్చి సొంతంగా వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఉరాన్ తాలూకాలోని నవా శేవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు శ్రీనివాస్ బ్రిడ్జ్‌పై నుంచి సముద్రంలోకి దూసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
బ్రిడ్జి పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
ముంబై – అటల్ సేతు బ్రిడ్జి మీద తన కారు ఆపి.. తర్వాత నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి pic.twitter.com/7qeGyXo0vW
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
Also Read..
Manali | మనాలీలో మెరుపు వరదలు.. ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు
Droupadi Murmu | పంతులమ్మ అవతారమెత్తిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

