కొడుకు పెళ్లి కోసం రూ.6.5 లక్షలు పెట్టి హెలికాప్టర్ బుక్ చేసిన తండ్రి.. ఎందుకో తెలుసా?
విజేందర్ సైనీ అనే పెళ్లి కొడుకు.. తన పెళ్లి కోసం కమ్రి గ్రామానికి హెలికాప్టర్లో వచ్చాడు. అక్కడ దిగి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురును
సాధారణంగా పెళ్లిళ్లలో ఎవరైనా పెళ్లి కొడుకును, పెళ్లి కూతురును పెళ్లి మండపానికి తీసుకురావడం కోసం.. లేదా ఊరేగింపు కోసం కారును రెంట్‌కు తీసుకుంటారు. సొంతంగా కారు ఉంటే అందులో ఊరేగిస్తారు. కానీ.. ఓ తండ్రి మాత్రం తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా హెలికాప్టర్‌నే బుక్ చేశాడు. అది కూడా రూ.6.5 లక్షలు పెట్టి మరీ తన కొడుకు పెళ్లి కోసం హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లా కమ్రి అనే గ్రామంలో చోటు చేసుకుంది.
విజేందర్ సైనీ అనే పెళ్లి కొడుకు.. తన పెళ్లి కోసం కమ్రి గ్రామానికి హెలికాప్టర్లో వచ్చాడు. అక్కడ దిగి పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురును తీసుకెళ్లి హెలికాప్టర్లో ఎక్కించి అక్కడి నుంచి తన ఊరు భరత్‌పూర్‌కు వెళ్లిపోయాడు.
తన కొడుకు పెళ్లి కోసం హెలికాప్టర్‌ను బుక్ చేస్తానని.. విజేందర్ సైనీ తండ్రి రాధేశ్యామ్ తండ్రి ఆ ఊరి ప్రజలకు చెప్పాడట. చెప్పినట్టే.. తన కొడుకు పెళ్లికి రూ.6.5 లక్షలు ఖర్చు పెట్టి మరీ హెలికాప్టర్‌ను బుక్ చేశాడు రాధేశ్యామ్.
నిజానికి.. రాధేశ్యామ్ది ధనవంతుల కుటుంబం కూడా కాదు. మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ.. తన కొడుకు కోసం ఊరికి హెలికాప్టర్ తెప్పించడంతో ఆ ఊరి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

