లక్నో: పెళ్లి చేసుకున్న స్నేహితుడ్ని తొలి రాత్రి వీడియో తీయాలని ఒక వ్యక్తి సూచించాడు. ఆ తర్వాత ఆ వీడియోను అతడు పొందాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు. (Man Blackmails Friend) పలుమార్లు డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో శివమ్ మిశ్రా ఫ్రెండ్ పెళ్లి జరిగింది. అయితే మధుర జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి తొలి రాత్రిని వీడియో తీయాలని స్నేహితుడికి సూచించాడు.
కాగా, రికార్డ్ చేసిన ఆ వీడియోను మోసపూరితంగా శివమ్ పొందాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి స్నేహితుడ్ని బ్లాక్మెయిల్ చేశాడు. పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధిత వ్యక్తి విసిగిపోయాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో శివమ్ మిశ్రాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.