ముంబై: పరిచయమైన మహిళపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Repeatedly Raping Woman) దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ కోరింది. నిరాకరించిన అతడు అబార్షన్ చేయించుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల రియాసత్ ఇలియాస్ ఖురేషి, 24 ఏళ్ల మహిళ మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు ఆమెను లోబర్చుకున్నాడు. 2022 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ మహిళపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, ఆ మహిళ గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని టైలర్ అయిన రియాసత్ ఇలియాస్ ఖురేషిని డిమాండ్ చేసింది. అయితే పెళ్లికి అతడు నిరాకరించాడు. అలాగే అబార్షన్ చేయించుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.