ముంబై : పుణేలో దక్షిణ కొరియా వ్లాగర్‌ను (Korean vlogger) వేధింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్నాటకలోని బీదర్‌కు చెందిన భరత్ ఉంచాలేగా గుర్తించారు. సోషల్ మీడియా వేదికలపై ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం పెల్లుబికిన క్రమంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైరల్ వీడియోలో కొరియా వ్లాగర్ కెల్లీ పుణేలోని స్ధానిక దుకాణాదారులు, కస్టమర్లతో మాట్లాడుతుండగా అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకోవడం కనిపిస్తుంది. వారిలో ఒకరు ఆమె మెడపై చేయి వేసి దురుసుగా వ్యవహరిస్తాడు. అతడి నుంచి దూరంగా జరిగేందుకు కెల్లీ ప్రయత్నించినా నిందితుడు పట్టు బిగిస్తాడు.
ఆ సమయంలో అసౌకర్యంగా కనిపించిన కెల్లీ నేను ఇక్కడ నుంచి పారిపోవాలి అనడం వినిపిస్తుంది. దివాళీ వేడుకల సందర్భంగా పింప్రి చించ్వాద్ ప్రాంతానికి వచ్చిన కెల్లీ గత వారం ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. ఇక గత ఏడాది ముంబైలో మరో దక్షిణ కొరియా వ్లాగర్‌ను వెంటాడి వేధించిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఉదంతం వెలుగుచూసింది.
Read More :
Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భారత్ కారణం కాదు: నవాజ్ షరీఫ్